ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే నా ఇల్లు నా సొంతం పేరిట ఉద్యమం' - mla nimmala ramanaidu latest news

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తెదేపా శ్రేణులు పాలకొల్లు టిడ్కో గృహాల వద్ద భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ మహా ప్రదర్శన నిర్వహించామని ఎమ్మెల్యే రామానాయుడు వెల్లడించారు.

'పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే నా ఇల్లు నా సొంతం పేరిట ఉద్యమం'
'పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే నా ఇల్లు నా సొంతం పేరిట ఉద్యమం'

By

Published : Oct 3, 2020, 10:11 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు పాలకొల్లు టిడ్కో గృహాల వద్ద భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ మహా ప్రదర్శన నిర్వహించామని ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. అనంతరం పాలకొల్లు టిడ్కో గృహాల వద్ద గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

భారీ ర్యాలీ..

భారీ జాతీయ పతాకంతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పేదలకు నివాసాలు కేటాయించాలని నినాదాలు చేశారు.

గాంధీజీ స్ఫూర్తితో..

టిడ్కో ఇళ్లు స్వాధీనం చెయ్యకపోతే గాంధీజీ స్పూర్తితో నా ఇల్లు నా సొంతం అంటూ ఉద్యమిస్తామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. పేదలకు నివాసాలు కేటాయించకుండా వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

ఇవీ చూడండి : కాలుష్యరహితంగా విశాఖను అభివృద్ధి చేస్తాం: విజయసాయి రెడ్డి

ABOUT THE AUTHOR

...view details