ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUICIDE ATTEMPT: దంపతుల ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా ? - wife and husband suicide attempt

ఓ పార్సిల్​ విషయంలో వివాదం తలెత్తడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి భార్యతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ దంపతులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.

wife and husband suicide attempt
జంగారెడ్డిగూడెంలో దంపతుల ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 13, 2021, 3:55 PM IST

Updated : Oct 13, 2021, 6:11 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం(wife and husband suicide attempt at jangareddygudem)లో వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మీ అనే దంపతులు.. ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం(wife and husband suicide attempt) చేశారు. ఇంట్లో అపస్మారకస్థితిలో పడి ఉన్న దంపతులను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులు పగలగొట్టి దంపతులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

వెంకటేశ్వర్లు.. అమెజాన్ సంస్థలో పని చేస్తున్నారు. పార్శిల్​ లావాదేవీలలో అవకతవకలు జరగడంతో.. సంస్థ ఒత్తిడి తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Last Updated : Oct 13, 2021, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details