ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేస్తామని ఉంగుటూరు నేతలు చెబుతున్నారు. కైకరంలో తెదేపా మండల కమిటీ సమావేశాన్ని శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. పార్టీ మీద నమ్మకంతో ఎంపీటీసీ స్థానాలకు నామపత్రాలు దాఖలు చేశారని.. ఇప్పుడు వారిని మధ్యలోనే వదిలేస్తే, అన్ని విధాలా నష్టపోతారని చింతల శ్రీనివాస్ తెలిపారు.
'ఎన్నికల బరిలో ఉంటాం.. తెదేపా జెండా ఎగరేస్తాం' - పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పశ్చిమ గోదావరి తెదేపా నేతలు న్యూస్
కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు జడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతల శ్రీనివాస్, తెదేపా మండల అధ్యక్షుడు పాతూరి విజయ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
tdp-leaders
పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను గౌరవిస్తూనే బరిలో నిలిచి విజయం సాధిస్తామని వెల్లడించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండలంలో మేజర్ పంచాయతీల్లో తెదేపా జెండా ఎగరేశామని.. ఇదే ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతామన్నారు.
ఇదీ చదవండి:పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో జనసేన పిటిషన్