పశ్చిమగోదావరి జిల్లాలో దారి దోపిడీలకు పాల్పడుతున్న.. నలుగురు దొంగలను పెనుగొండ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలతో సహా నలుగురు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దారిదోపిడీలు ఎక్కువగా జరుగుతుండటంతో.. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
ఈ క్రమంలో పెనుగొండ కళాశాల సెంటర్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఒక వాహనంలో ముగ్గురు మహిళలు డ్రైవరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు తనిఖీ చేశారు. వాహనాల్లో బంగారు ఆభరణాలు లభించడంతో కారులో మహిళలను విచారించారు. ప్రయాణికుల నుంచి దోచుకున్న ఆభరణాలుగా వారు అంగీకరించటంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.