మా ఆయనకు ఓటేయండి.. గెలిపించండి! - ఏలూరు ఎంపీ మాగంటి బాబు సతీమణి పద్మవల్లీ దేవి ప్రచారం
శాసనసభ ఎన్నికల్లో తన భర్తను గెలిపించాలంటూ.. ఏలూరు ఎంపీ మాగంటి బాబు సతీమణి పద్మవల్లీ దేవి ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.
![మా ఆయనకు ఓటేయండి.. గెలిపించండి!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2830280-84-9815f7cc-33da-4ac0-993b-2f1457c819bb.jpg)
ఏలూరు ఎంపీ మాగంటి బాబు సతీమణి పద్మవల్లీ దేవి ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఏలూరు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి బాబు విజయం కోసం.. ఆయన సతీమణి పద్మవల్లి దేవి ఎన్నికల ప్రచారం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తిరిగి ఓట్లుఅభ్యర్థించారు. జూట్మిల్లులో కార్మికులను కలిసి తన భర్త ఎంపీ మాగంటి బాబుకు, ఎమ్మెల్యే బడేటి బుజ్జికి ఓటేయాలని కోరారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు.