పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిలో రికార్డుస్థాయిలో వరద ఉద్ధృతి పెరిగింది. పలు గ్రామాలు ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారు. పోలవరం మండలం కొత్తూరు వంతెనపైకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటితో 19గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగు వంతెన పైకి వరదనీరు చేరింది. కోయిదా, కట్కూరు, రేపాక గొమ్ము పంచాయతీల్లోని గ్రామాలకూ రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 32 గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వరద ఉద్ధృతితో ముంపు గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో రికార్డుస్థాయిలో పెరిగిన వరద ఉద్ధృతి - గోదావరి వరదలు తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాకు వరద ఉద్ధృతి పెరిగింది. 32 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తూరు వంతెనపైకి భారీగా వరద నీరు చేరింది. ముంపుగ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
జిల్లాలో రికార్డుస్థాయిలో పెరిగిన వరద ఉద్ధృతి