లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు ప్రజలతో మర్యాదగా ఉండాలని డీఎస్పీ స్నేహిత పోలీసులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సబ్ డివిజనల్ పోలీసులతో, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మరో 15 రోజులు అత్యంత కీలకంగా మారనున్నందున ప్రజల సహకారం పూర్తిగా అవసరమని తెలిపారు. పోలీసు శాఖతో పాటు పని చేసేందుకు ఆర్టీసీ, అటవీశాఖ ఎక్సైజ్ శాఖలు శనివారం నుంచి విధుల్లో చేరతారని డీఎస్పీ తెలిపారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు ఉంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అత్యవసరమైతేనే.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.
'పోలీసులు ప్రజలతో మర్యాదగా ఉండాలి'
లాక్ డౌన్ అమలుపై పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో డీఎస్పీ స్నేహిత సమీక్షించారు. జిల్లాలో లాక్డౌన్ అమలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సిబ్బందికి సూచనలు చేశారు.
west godavari DSP snehitha meeting with officials at jangareddygudema