ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విదేశాల నుంచి వచ్చిన వారిని పర్యవేక్షిస్తున్నాం' - పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణితో​ ముఖాముఖి

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 13 కరోనా అనుమానితుల కేసులు నమోదు అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి సుబ్రమణ్యేశ్వరీ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

west godavari dmho interview
పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణితో ఈటీవీ భారత్​ ముఖాముఖి

By

Published : Mar 27, 2020, 7:31 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించటానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. క్వారంటైన్ల ఏర్పాటు నుంచి, వైద్య సదుపాయాల వరకు అన్ని సర్వం సిద్ధం చేసింది. ఇప్పటివరకు జిల్లాలో 13 మంది కరోనా అనుమానిత కేసులు నమోదు అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి సుబ్రమణ్యేశ్వరీ వివరించారు. వైద్య పరీక్షల్లో 11 మందికి నెగెటివ్ వచ్చినట్లు స్పష్టం చేశారు. మిగిలిన ఇద్దరి అనుమానితుల నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణితో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details