West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్ కవురు శ్రీనివాస్‌కు నిరసన సెగ తగిలింది. యలమంచిలి మండలం కనకాయలంక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీనివాస్‌ను గ్రామస్తులు నిలదీశారు. పాఠశాలల విలీనంతో తమ గ్రామంలోని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని., చిన్నపిల్లలు బడి కోసం రెండు కిలోమీటర్లు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసిన తర్వాతే తమ గ్రామంలో అడుగు పెట్టాలని మహిళలు భీష్మించారు. జడ్పీ ఛైర్మన్‌పై మహిళలు పెద్దసంఖ్యలు తిరగబడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు శ్రీనివాస్ ను అక్కడి నుంచి తరలించారు.
పశ్చిమ గోదావరి జడ్పీ ఛైర్మన్ కవురు శ్రీనివాస్‌కు నిరసన సెగ - AP Latest
West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్ కవురు శ్రీనివాస్‌కు నిరసన సెగ తగిలింది. కనకాయలంక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీనివాస్‌ను గ్రామస్తులు నిలదీశారు. మహిళలు పెద్దసంఖ్యలో తిరగబడటంతో పోలీసులు ఆయనను అక్కడి నుంచి తరలించారు.
పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్