నెల్లూరులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైకాపా నాయకుల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారని తెదేపా సీనియర్ నాయకుడు పెనుమర్తి రామ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం ఏ మాత్రం కృషి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ కేంద్రాల్లో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వారికి మంచి వైద్య సదుపాయం అందజేయాలంటూ నాయకులు చెరుకూరి శ్రీధర్ రాజ్‌పాల్ డిమాండ్ చేశారు.
'ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి' - ntr statue distros latest news
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తెదేపా నాయకులు వైకాపా తీరుపై మండిపడ్డారు. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడమే వైకాపా ఎజెండాగా పాలన సాగిస్తోందని విమర్శించారు. నెల్లూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని శిక్షించాలి తెదేపా నేతలు
TAGGED:
tdp leaders latest news