జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ అన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఆయన... జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, చింతలపూడి, పోలవరం, దేవరపల్లి, భీమవరం, నరసాపురం, మొగల్తూరు.. తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేశామన్నారు. 10 వేల లీటర్ల బెల్లం ఊట, నల్లబెల్లంతో పాటు తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై మొత్తం 11 కేసులు నమోదు చేశామన్నారు.
'అక్రమ రవాణాలపై ఉక్కు పాదం మోపుతాం' - పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమ మద్యం
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ను జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ పరిశీలించారు. జిల్లాలో అక్రమంగా మద్యం, ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

'అక్రమ మద్యం, ఇసుక రవాణాపై ఉక్కు పాదం'