పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వర రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం... నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామానికి చెందిన కరగర రామకృష్ణ అనే వ్యక్తి... స్థానికంగా వస్త్ర వ్యాపారం చేస్తూ మరో వ్యక్తి దగ్గర రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. నగదు తీసుకుని రామకృష్ణ తన స్వగ్రామానికి వెళ్తుండగా... నల్లజర్ల శివారులో గుర్తు తెలియని వ్యక్తులు రామకృష్ణపై దాడి చేసి రూ.1.35 లక్షలు నగదు, 28 గ్రాముల బంగారాన్ని లాక్కుని ఉడాయించారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు వేగవంతం చేసి 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.
48 గంటల్లోనే నల్లజర్ల కేసును ఛేదించిన పోలీసులు - west godavari district latest news
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. అపహరణ, దొంగతనానికి పాల్పడిన ఏడుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.80,000 నగదు, 28 గ్రాముల బంగారం, ద్విచక్రవాహనం, కారు స్వాధీనం చేసుకున్నారు.
నల్లజర్ల కేసును ఛేదించిన పోలీసులు