ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమను రెగ్యులర్ చేయాలని ఆరోగ్య సిబ్బంది నిరసన

తమను వెంటనే రెగ్యులర్ చేయాలని కొరుతూ వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న ఆరోగ్య సిబ్బంది నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వాటర్ ట్యాంక్ ఎక్కి "జగనన్న ఇచ్చిన మాట నిలుపుకో" అంటూ నినాదాలు చేశారు.

regularization of health workers
రెగ్యులర్ చేయాలని కొరుతూ నిరసన

By

Published : Oct 31, 2020, 6:22 PM IST

కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న తమను వెంటనే రెగ్యులర్ చేయాలని ఆరోగ్య సిబ్బంది ఆందోళన చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం విసాకోడేరు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక వాటర్ ట్యాంక్ ఎక్కి "జగనన్న ఇచ్చిన మాట నిలుపుకో" అంటూ నినాదాలు చేశారు.

గత పద్దెనిమిదేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్నామని... తమకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ఎంతోమంది సిబ్బంది మరణించారని వారి కుటుంబాలను ఆదుకునే వారే కరువయ్యారన్నారు. వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి తమను ఆదుకోవాలని వారు కోరారు.

ఇదీ చదవండీ...అన్నదాతల ఆగ్రహ జ్వాలలు...ఉద్రిక్తంగా జైల్​ భరో

ABOUT THE AUTHOR

...view details