భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ.. గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జవాను. మార్కొండపాడుకు చెందిన మల్లిపూడి రజనీకుమార్ లడఖ్ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నాడు. గుండె పోటుతో అక్కడే మృతి చెందిన రజనీ కుమార్ భౌతికకాయాన్ని బుధవారం స్వగ్రామం తరలించారు.
మార్కొండపురంలో అశృనయనాల నడుమ, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి తానేటి వనిత, ఆర్మీ మేజర్ ఎస్.పాల్‌సింగ్, సైనికాధికారులు రజనీకుమార్ భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించారు. కుమార్ మృతదేహంపై జాతీయ జెండా ఉంచి వందన కార్యక్రమం నిర్వహించారు.