ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వ్యవసాయ చట్టాలు రైతుల మనుగడకే ప్రశ్నార్థకం' - bhimavaram updates

దిల్లీ సరిహద్దులో అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.

west godavari district farmers tractor rally
పశ్చిమగోదావరి జిల్లా రైతుల ట్రాక్టర్ ర్యాలీ

By

Published : Jan 3, 2021, 10:11 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం నుంచి భీమవరం వరకు రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రైతులకు నష్టం కలిగించే మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా భీమవరం పాత బస్టాండ్ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించారు.

ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హాజరయ్యారు. రాష్ట్ర రైతు సంఘం నాయకుడు నాగేంద్రనాథ్, ఆల్ ఇండియన్ రైతు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాలు రైతులు మనుగడకే ప్రశ్నార్థకంగా మారతాయని అన్నారు. వెంటనే తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details