పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. 24 గంటల్లో 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 418కి చేరింది. ఏలూరు 3, భీమవరం 5, నరసాపురం 3, ఆకివీడు 4, పాలకోడేరు 2, మొగల్తూరు 2, తణుకు, పెదేవేగి, కాళ్ల, ఉండ్రాజవరం మండలాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
జిల్లాలో 9 మంది కొవిడ్ బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. కొత్తగా 5 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. కేసుల సంఖ్య పెరగటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి వల్లే వ్యాధి తీవ్రత అధికమైందని అధికారులు అంటున్నారు.