ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ - polavaram

పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

West Godavari district Collector R Muthyala Raju
West Godavari district Collector R Muthyala Raju

By

Published : Aug 16, 2020, 5:08 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు పరిశీలించారు. ఇప్పటికే భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పోలవరంలో బలహీనంగా ఉన్న నెక్లెస్ బండ్​ను కలెక్టర్ పరిశీలించారు.

వరద తాకిడికి గట్టు బలహీనపడకుండా బండరాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం మండలం కొత్తూరు, తల్లవరం గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఏజెన్సీ గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details