పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెంటనే పంపాలని వైద్య శాఖ అధికారులను కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశించారు. ఏలూరులోని కలెక్టర్ చాంబర్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. అతి ప్రమాదకర ప్రాంతాలు, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, కలపర్రు టోల్ ప్లాజా వెడల్పు పెంచి టోల్ బూతులు పెంచాలను కలెక్టర్ సూచించారు.
'ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలి'
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టర్ చాంబర్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల చికిత్స అందించేందుకు ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ ముత్యాలరాజు
పంచాయతీ, మున్సిపల్, ఆర్ అండ్ బి రహదారులు పెద్ద గొంతులు గుర్తింపు, ఆర్అండ్బీ సూచి బోర్డులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హోర్డింగ్లు తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్పీడ్ లిమిట్ బోర్డు ఏర్పాటు తదితర అంశాలపై భద్రతా కమిటీ సభ్యులతో కలెక్టర్ క్షుణ్ణంగా సమీక్షించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో వచ్చే నాలుగైదు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు