పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు 59 శాంపిల్స్ పరీక్షించారు. 44 నెగిటివ్ నివేదికలు వచ్చాయి. 244 అనుమానిత కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 4821 మంది విదేశాల నుంచి వచ్చిన వారుండగా, 2918 మంది గృహ నిర్బంధాన్ని పూర్తి చేసుకొన్న వారున్నారు. 1903 మంది ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. 15 పాజిటివ్ కేసులు వచ్చిన ఏలూరు, భీమవరం, పెనుకొండ, ఆకివీడు, ఉండి, గుండుగొలను ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించారు. 21 వేల కుటుంబాలను అధికారులు గృహనిర్బంధంలో ఉంచారు. రెడ్‌జోన్ పరిధిలో 3 కిలోమీటర్ల మేర నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. జిల్లాలో 5 వేల క్వారంటైన్ పడకలు సిద్ధం చేశారు. పాజిటివ్ వచ్చిన బాధితులు ఎక్కడెక్కడ తిరగారన్న వివవరాలు అధికారులు ఆరా తీస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కరోనా వివరాలు - పశ్చిమ గోదావరి కరోనా వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించి, 3 కిలోమీటర్ల మేర నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. బాధితులు ఎవరెవర్ని కలిశారన్న వివరాలు అధికారులు ఆరా తీస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కరోనా వివరాలు