ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు పహారా: పశ్చిమగోదావరిలో పూర్తిస్థాయి లాక్​డౌన్

పశ్చిమగోదావరి జిల్లాలో లాక్​డౌన్ రెండో రోజు పూర్తిస్థాయిలో అమలవుతోంది. రోడ్లపై వచ్చిన వారిని సైతం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. పోలీసులు చేపట్టిన చర్యలతో రహదారులు పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో స్వచ్ఛంద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

west godavari complete lock down
పశ్చిమగోదావరిలో పూర్తిస్థాయి లాక్​డౌన్

By

Published : Mar 24, 2020, 7:42 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో రెండో రోజు లాక్​డౌన్​ పోలీసులు నియంత్రణతో పూర్తిస్థాయిలో అమలవుతోంది. జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ పరిస్థితి నెలకొంది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యావసర దుకాణాలు మినహా మిగతా అన్ని షాపులు మూసివేశారు. ఏలూరుతోపాటు.. భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిత్యావసరాల దుకాణాలు సైతం ఉదయం పది గంటల తర్వాత మూసి వేయించారు పోలీసులు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

పశ్చిమగోదావరిలో పూర్తిస్థాయి లాక్​డౌన్

ABOUT THE AUTHOR

...view details