కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న బంద్‌లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. రాష్ట్రం ప్రభుత్వం బంద్‌కు మద్దతు ప్రకటించడంతో వాటిని ముందుగానే డిపోల్లో నిలిపేశారు. నిత్యం ప్రయాణికులతో కళకళలాడే బస్టాండ్లు బంద్‌తో బోసిపోయాయి. వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంతంగా భారత్ బంద్ - west godavari latest news
కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బంద్‌కు మద్దతు ప్రకటించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హోటళ్లు, దుకాణాలు మూతపడ్డాయి.
పశ్చిమగోదావరి జిల్లా వార్తలు,పశ్చిమ గోదావరిలో భారత్ బంద్ వార్తలు