అక్రమంగా మద్యం అమ్ముతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు స్నేహితుడని కూడా చూడకుంటా కత్తితో నరికాడో వ్యక్తి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగింది.
West godavari: స్నేహితున్ని కత్తితో నరికిన వ్యక్తి - నేర వార్తలు
అక్రమంగా మద్యం అమ్ముతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు స్నేహితుడినే కత్తితో నరికాడో వ్యక్తి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఉరదాల వరప్రసాద్, దేవరకొండ శ్రీనులు స్నేహితులు. వరప్రసాద్ తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రీను మాంసం దుకాణం నిర్వహంచటంతో పాటు రాత్రివేళల్లో మద్యం విక్రయిస్తుంటాడు. మద్యం అమ్మ వద్దని వరప్రసాద్.. శ్రీనును మందలించాడు. అతను పట్టించుకోలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు వరప్రసాద్. అతనిపై కక్ష పెంచుకున్న శ్రీను.. వరప్రసాదు తల, చేతులు, వీపుమీద కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:putta sudhakar yadav: 'వైకాపా పాలనలో అవినీతి పెరిగిపోయింది'