ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని ఎలుకలు తిన్న ఘటనపై వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఆస్పత్రిని పరిశీలించిన ఆయన...బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రెండురోజుల కిందట ఆస్పత్రి శవాగారంలో ఉంచిన వైకుంఠరావు అనే వ్యక్తి మృతదేహం కళ్లను ఎలుకలు తినేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవటంతో మంత్రి నాని చర్యలకు ఉపక్రమించారు.
'ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటాం' - ఏలూరు ఆసుపత్రి ఘనటపై ఆళ్ల నాని కామెంట్స్
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని ఎలుకలు తిన్న ఘటనపై వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
వైద్యఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని
ఇదీచదవండి
వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించండి: చినరాజప్ప