బీసీ వర్గాలు తెదేపాకు అండగా నిలవాలని మంత్రి పితాని సత్యనారాయణ కోరారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో తెదేపా బీసీ మహిళ గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి శివరామరాజు, భీమవరం శాసనసభ అభ్యర్థి రామాంజనేయులుకు బీసీలు మద్దతుగా నిలిచి అఖండ విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు.
బీసీలంతా తెదేపాకు అండగా ఉండాలి: పితాని - west godawari
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని పితాని సత్యనారాయణ బీసీలకు సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో తెదేపా బీసీ మహిళా గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బీసీ మహిళ గర్జన