నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంట్లో స్పీకర్ ఓం బిర్లాను వైకాపా ఎంపీల బృందం కలిసింది. అనంతరం భేటీ వివరాలను వైకాపా ఎంపీలు మీడియాకు వెల్లడించారు.
క్షమశిక్షణ తప్పారు
రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చాం. అన్ని విషయాలు పరిశీలించాక చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో ఆ పార్టీపైనే రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేస్తున్నారు. స్వపక్షంలో విపక్షంలా రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్నారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. ఊహాజనితమైన విషయాలను ఊహించుకుని ప్రజలకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైనా అసంతృప్తి ఉంటే పార్టీ అధినేత దృష్టికి తీసుకురావాలి. రఘురామకృష్ణరాజు క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనబడుతోంది. బహిరంగంగా పార్టీ నియమావళి, క్రమశిక్షణను ఉల్లంఘించారు -విజయ సాయిరెడ్డి, వైకాపా ఎంపీ