Water problem for agriculture: వేసవి ఆరంభంలోనే పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో సాగునీటి ఎద్దడి ఏర్పడింది. ప్రధాన కాలువల్లో నీటిప్రవాహాలు తగ్గడం వల్ల... పిల్లకాలువలకు నీరందడం లేదు. దీనివల్ల కాలువల శివారున వేల ఎకరాల వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా నెలకు పైగా సాగునీటి సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పుడే ఎద్దడి ఏర్పడటం రైతులను భయపెడుతోంది. ఎండలు ముదిరేకొద్దీ పరిస్థితి ఏంటని.. ఉండి మండలం చెరుకువాడకు చెందిన కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు లేక కౌలు రైతులు సాగు చేస్తున్న పొలాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు సొంతంగా డబ్బులు ఖర్చుచేసి.. కాలువలో పూడిక తీశారు. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.
గోదావరిలో నీరున్నా కాలువలు పూడిపోయి..
సాగునీటి కాలువల శివారు ప్రాంతాల్లో నానాటికీ జలమట్టం పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గోదావరిలో నీరున్నా కాలువలు పూడిపోయి.. వరి సాగు దినదినగండంగా మారుతోంది. వంతులవారీగా నీరు విడుదల చేస్తున్నా.. సమస్య పరిష్కారం కావడం లేదు. ఒక్కో కాలువకు వారంలో 3రోజులుగా వంతులు ఇవ్వాల్సి ఉండగా.. రెండు రోజులతో సరిపెడుతున్నారు. దీనివల్ల నీరు చేరక చివరి పొలాలు ఎండిపోయాయి. 15 రోజులుగా నీళ్లు లేక.. 30వేల ఎకరాలకు పైగా వరి పొలాల్లో బీటలు వచ్చాయి.
ముందుకు కదలని నీరు..