పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. కాఫర్ డ్యాం వద్ద 27.1మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి ఛానల్‌కు 32,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Alert: పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం - పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద నీటిమట్టం న్యూస్
పోలవరం ప్రాజెక్టు(polavaram project) వద్ద గోదావరి(godavari) నీటిమట్టం పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది.
సీఎం జగన్ (cm jagan) ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌తో పాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ పోలవరానికి వెళ్లారు. వర్షాల సీజన్ ప్రారంభం కావటంతో గోదావరి (godavari river)లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కాఫర్ డ్యామ్ ఎగువన ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ముంపు గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించే పనులు జరుగుతున్నాయి. నిర్వాసితుల అంశంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశమున్నట్టు జలవనరులశాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:kollu arrest: మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం.. కొల్లు రవీంద్ర అరెస్ట్!