వార్డు, గ్రామ వాలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మండలంలో ఖాళీగా ఉన్న వార్డు, గ్రామ వాలంటీర్ పోస్టులకు నియమితులైన వారికి ఆయన నియామక పత్రాలు అందజేశారు.
వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత - ward volunteer recruitment news in tanuku
పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు... వార్డు, గ్రామ వాలంటీర్ పోస్టులకు నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించాలని వారికి సూచించారు.

వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత
పట్టణంలో ఖాళీగా ఉన్న 64 వార్డు వాలంటీర్ పోస్టులకు గాను... 29 మందిని ఎంపిక చేశారు. మిగిలిన పోస్టులు రిజర్వేషన్ల వారీగా భర్తీ కావాల్సి ఉంది. వాటికి దరఖాస్తులు రాకపోవటంతో నియామకాలను నిలిపివేశారు.