పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ పండు నవీన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఆధార్ కార్డులో ఇంటిపేరు ఎందుకు మార్చలేదని ఓ మహిళ ప్రశ్నించటంతో...నవీన ఇంటికి ఏడుస్తూ వచ్చింది. తల్లిదండ్రులు విషయం తెలుసుకుని ఆమెను వారించి పొలం పనులకు వెళ్లారు. తీవ్ర మనస్తాపానికి గురైన నవీన... చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకునేసరికి... ఆమె తుది శ్వాస విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామ వాలంటీర్‌ను నిలదీసిన మహిళ..మనస్తాపంతో ఆత్మహత్య - ఆధార్ కార్డులో పేరు మార్చమంటే...ఆత్మహత్యకు పాల్పడింది!
ఆధార్ కార్డులో పేరు మార్పునకు సంబంధించి ఓ మహిళ గ్రామ వాలంటీర్‌ను ప్రశ్నించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె..ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
![గ్రామ వాలంటీర్‌ను నిలదీసిన మహిళ..మనస్తాపంతో ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4367690-778-4367690-1567858494391.jpg)
ఆధార్ కార్డులో పేరు మార్చమంటే...ఆత్మహత్యకు పాల్పడింది!
ఆధార్ కార్డులో పేరు మార్చమంటే...ఆత్మహత్యకు పాల్పడింది!