పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లిలో ఉన్న నిర్మల రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర వస్తుందో లేదో అనే అంశంపై చేపట్టిన ఈ సోదాల్లో భారీ ఎత్తున ధాన్యం నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిర్మల రైస్ మిల్ పరిమితి 5000 మెట్రిక్ టన్నులు అని అధికారులు తెలిపారు. పరిమితికి మించి 2950 మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. రైస్ మిల్ యాజమాన్యంపై తగు చర్యలు నిమిత్తం ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి విజిలెన్స్ అధికారులు తీసుకెళ్లనున్నారు.
నిర్మల రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు - పశ్చిమ గోదావరి జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లిలో ఉన్న నిర్మల రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర వస్తుందో లేదో అనే అంశంపై చేపట్టిన ఈ సోదాల్లో భారీ ఎత్తున ధాన్యం నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
![నిర్మల రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3246543-798-3246543-1557511065552.jpg)
రైస్ మిల్లు పై విజిలెన్స్ దాడులు