పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో విశ్వహిందూ పరిషత్ సమావేశం నిర్వహించారు. తితిదే భూములే కాకుండా ఏ దేవాలయ భూములు అమ్మే హక్కు ప్రభుత్వానికి గాని పాలకమండలికి గాని లేదని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య కుమార్ అన్నారు. దేవాలయ భూములు ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడకుండా కేవలం హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చట్టబద్ధమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.
'అప్పుడు అది ప్రసాదం అవ్వదు... మిఠాయిలా మారుతుంది' - latest west godavari district news
హిందూ దేవాలయ భూములు విక్రయించాలన్న నిర్ణయం హిందువుల మనోభావాలను కించపరిచినట్లు అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి అన్నారు. తిరుమల వెంకన్న లడ్డూలు జిల్లాలకు తెచ్చి అమ్మడం హిందూ సాంప్రదాయ ప్రకారం మంచిది కాదని వారు పేర్కొన్నారు.
తిరుమల వెంకన్న లడ్డూలు జిల్లాలకు తెచ్చి అమ్మడం హిందూ సాంప్రదాయ ప్రకారం మంచిది కాదని వారు పేర్కొన్నారు. కేవలం తిరుపతిలో స్వీకరించిన ప్రసాదమే భక్తులు ప్రసాదంగా భావిస్తారని జిల్లాల వారీగా తీసుకొచ్చి విక్రయిస్తే మిఠాయి పట్టణాల్లో స్వీట్లు మాదిరిగా ప్రజలు స్వీకరిస్తారని విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు మానుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలు అన్యమత ఉద్యోగులను తొలగించి వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఏర్పాటు చేయాలంటూ కోరుకున్నారు.
ఇది చదవండి 'మిడతల దండుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’