ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గణనాథుడికి ఇలా మొక్కుకుంటే.. మీ కోరిక తీరినట్లే..! - vinayaka chavithi at west godavari

పశ్చిమ గోదావరి జిల్లాల్లో వినాయక చవితికి ప్రత్యేకమైన రీతిలో మొక్కుకోవడం, తీర్చుకోవడం అక్కడి సాంప్రదాయం. ఉండ్రాజవరంలో మండలంలో.. పెళైన కొత్త దంపతులు తమకు సంతానం కావాలని, పెళ్లికాని యువతీ, యువకులు పెళ్లిళ్లు కావాలని వినాయకుడిని మొక్కుకుంటారు. వినాయక చవితి నాడు గణనాథుడి ప్రతిమను చిన్న మండపంలో అలంకరణ చేసి.. దానిని మోస్తూ వీధుల వెంట ఊరేగుతారు. ఊరేగింపు తర్వాత ఆ మట్టి ప్రతిమను నిమజ్జనం చేస్తారు. ఇలా చేస్తే తాము కోరిన కోరికలను దేవుడు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొన్ని దశాబ్దాలుగా ఈ సాంప్రదాయాలను ఇక్కడి ప్రజలు పాటిస్తూ ఉండటం విశేషం.

vinayaka chavithi
వినాయకుని ఊరేగింపు

By

Published : Sep 11, 2021, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details