పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం కొండ్రు కోట గిరిజన గ్రామంలోకి వచ్చిన నల్లతాచును(కింగ్ కోబ్రా) గ్రామస్థులు చంపేశారు. అరుదైన భారీ నల్లతాచు పాము గోదావరి వరదలో కొట్టుకొచ్చి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు. గ్రామంలో ప్రమాదకరంగా తిరుగుతుండటంతో కాటు వేస్తుందేమోననే భయంతోనే చంపేసినట్లు పేర్కొన్నారు. సర్పం పొడవు దాదాపు 13 అడుగులు ఉంది. విషసర్పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల వాటి సంతతి అభివృద్ధి జరగకుండా నల్లతాచు నిరోధిస్తుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అరుదుగా కనిపించే ఈ నల్లతాచు లోతట్టు అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని అన్నారు.
గ్రామస్థుల చేతిలో నల్లతాచు హతం - godavari floods
పశ్చిమగోదావరి జిల్లా కొండ్రుకోటలో నల్లతాచును గ్రామస్థులు కొట్టి చంపేశారు. పాము గోదావరి వరదలో కొట్టుకువచ్చి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు.
నల్లతాచు