ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొహిబిషన్​ అండ్​ ఎక్సైజ్​ స్టేషన్​ ఎదుట గ్రామస్థుల ఆందోళన - jaggareddy gudem seb police station news

టి.నరసాపురం మండలం వెలగపాడు గ్రామస్థులు జంగారెడ్డిగూడెంలో ఎస్ఈబీ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రామ వాలంటీరుపై అక్రమంగా సీఐ కేసు పెట్టారని ఆరోపిస్తూ స్టేషన్​ ఎదుట నిరసన తెలిపారు.

Villagers protest
ఎస్​ఈబీ స్టేషన్​ ఎదుట గ్రామస్థుల ఆందోళన

By

Published : Jun 29, 2020, 5:11 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రొహిబిషన్​ అండ్​ ఎక్సైజ్​ స్టేషన్ సీఐ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని టి.నరసాపురం మండలం వెలగపాడు గ్రామస్థులు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రామ వాలంటీర్ బొడ్డు వంశీ అనే వ్యక్తిపై సారా కేసు నమోదు చేశారని మాజీ సర్పంచ్ బొడ్డు శ్రీనివాస్ ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారులు న్యాయం చేయకపోతే వంశీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని తెలిపారు.

ధర్నాపై స్టేషన్ సీఐ స్పందిస్తూ జంగారెడ్డిగూడేనికి చెందిన ఇద్దరు వ్యక్తులు సారా తరలిస్తుండగా పట్టు పడ్డారని తెలిపారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంపై సారా సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. విచారణలో కాదని తేలితే కేసు తొలగిస్తామని సీఐ అజయ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి...

పాలకొల్లులో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details