corruption : పంచాయతీ సిబ్బంది ఆరు కోట్ల రూపాయల నిధులను కాజేశారంటూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరు మండలం వేండ్రలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిధులు దుర్వినియోగం చేశారంటూ..వాటికి సంబంధించిన వివరాలతో గ్రామస్థులు ఫ్లెక్సీలు రూపొందించారు.
మాజీ పంచాయతీ కార్యదర్శి ఏసేబు, కంప్యూటర్ ఆపరేటర్ సురేంద్ర, సర్పంచ్ నాగేశ్వరి నిధులు మళ్లించారని ఆరోపిస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని, అందువల్లే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని చెబుతున్నారు.