కోడిపందాలను జూదంలా కాకుండా సంప్రదాయ క్రీడగా చూడాలని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చేరుకుమిల్లి గ్రామస్థులు కోరుతున్నారు. గతేడాదిలా కాకుండా కోడి పందాల నిర్వహణకు... అనుమతి ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కోడిపందాలను సంప్రదాయ క్రీడగా చూడండి - ఆకివీడు వార్తలు
సంక్రాంతికి కోడిపందాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పశ్చిమగోదావరి జిల్లా చేరుకుమిల్లి గ్రామస్థులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిని సంప్రదాయ క్రీడగా చూడాలని కోరారు.
![కోడిపందాలను సంప్రదాయ క్రీడగా చూడండి Villagers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10175301-739-10175301-1610172502019.jpg)
గ్రామస్థులు
సంక్రాంతి అంటే కోడిపందాలు గుర్తుకువస్తాయని... వీటిని సంప్రదాయ పద్ధతిలో జరుపుకునే వారన్నారు. అయితే దీనికి భిన్నంగా కొంతమంది పార్టీల ప్రమేయాన్ని తేవడంతో ఇది జూద క్రీడగా పరిగణిస్తున్నారన్నారు. ద్వేషాలతో ఉంటే సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయన్నారు. గత ఏడాది జిల్లాలోని అన్నిచోట్ల కోడి పందాలు జరిగితే చెరుకుమిల్లి లో మాత్రం జరగకపోవడం దారుణమన్నారు. ఈ ఏడాదైనా కోడిపందాలను సంప్రదాయంగా జరుపుకునేలా చూడాలన్నారు.