గోదావరి ఉద్ధృతి పెరగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండల పరిధిలోని గ్రామాలు జలదిగ్బంధలో కొనసాగుతున్నాయి. అయోధ్యలంక, మరిమూల గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.
పెద్దమల్లంక, అన్నగారిలంక, పల్లిపాలెం లంక గ్రామాలు ముంపులో కొనసాగుతున్నాయి. వరద బాధిత లంక గ్రామాల్లో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు.