పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు లంక గ్రామం గుడివాకలంకలో చెప్పినమాట వినలేదని పలువురిపై గ్రామపెద్దలు ఆగ్రహించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారనే నెపంతో వారిపై జరిమానాలు విధించారు. ఇప్పటికే 25మందికి రూ.11 వేల చొప్పున జరిమానాలు వేసిన గ్రామపెద్దలు...చెల్లించకపోతే చేపల సొసైటీ వాటాలో కోత విధిస్తామని హెచ్చరించారు.
పంచాయతీ ఎన్నికల్లో మాట వినలేదని జరిమానా..ఎక్కడో తెలుసా? - పంచాయతీ ఎన్నికల్లో మాట వినలేదని జరిమానా
పంచాయతీ ఎన్నికల్లో చెప్పిన మాట వినకుండా... పోటీ చేశారనే నెపంతో పలువురికి గ్రామపెద్దలు జరిమానా విధించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.
మాట వినలేదని జరిమానా