ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ ఆసుపత్రిలో విజిలెన్స్ తనిఖీలు.. బయటపడ్డ అక్రమాలు

కొవిడ్ బాధితుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే అధికంగా వసూలు చేస్తున్నరనే ఆరోపణలతో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పీవీ ఆర్ ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన రోగుల వివరాలల్లో లోపాలు గుర్తించారు. కొవిడ్ రోగులకు చేయాల్సిన ఇంజెక్షన్లు బయట మార్కెట్లకు తరలిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.

vigilance searces at pvr hospital at jangareddy gudem
కొవిడ్ ఆసుపత్రిలో విజిలెన్స్ తనిఖీలు

By

Published : May 7, 2021, 8:15 AM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పీవీఆర్‌ ఆసుపత్రిలో గురువారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించామని డీఎస్పీ రమణ తెలిపారు. కొవిడ్‌ ఆసుపత్రిని సక్రమంగా నిర్వహించకపోవడం, రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తుండటం, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు దుర్వినియోగం తదితర ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేశామన్నారు.

ఆసుపత్రి రికార్డులు పరిశీలించామని, బాధితులను విచారించామని డీఎస్పీ రమణ అన్నారు. ఆస్పత్రిలో కేస్‌ షీట్లు నిర్వహణ సక్రమంగా లేదని, తీసుకున్న డబ్బులకు రశీదులు లేవని,. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఆరోగ్యశ్రీలో నమోదు చేసి బాధితుల నుంచి ఇంజెక్షన్లు, మందులకు డబ్బులు వసూలు చేయడం, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఇవ్వకుండా ఇచ్చినట్లు నమోదు చేయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఆసుపత్రి నిర్వాహకులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన దస్త్రాలను జంగారెడ్డిగూడెం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జీవనికి అందజేశారు. విజిలెన్స్‌ సీఐ విల్సన్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌, డాక్టర్‌ భాను పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్​ లీకేజీ: ఇంకా కళ్ల ముందే దుర్ఘటన దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details