ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

19 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - Seizure of smuggled rice in West Godavari district

జీలుగుమిల్లి చెక్​పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 19 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీ చోదకునిపై కేసు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నారు.

Vigilance officers
రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Nov 28, 2020, 6:17 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి చెక్​పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.

19 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు, లారీని స్వాధీనం చేసుకున్నామని సీఐ నాగేశ్వరరావు తెలిపారు. చోదకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details