ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లిపాయల అక్రమ నిల్వ చేసిన దుకాణాలపై కేసులు - Vigilance attacks

ఏలూరులో అక్రమంగా ఉల్లిపాయల నిల్వాలకు పాల్పడుతున్న దుకాణాలపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝలిపించారు. మూడు దుకాణాల్లో రూ.25లక్షలు విలువ చేసే ఉల్లిపాయలను అనాధికారికంగా నిల్వాచేసినట్లు కేసులు నమోదు చేశారు.

ఉల్లి దుకాణాలపై విజిలెన్స్ దాడులు

By

Published : Sep 26, 2019, 9:31 AM IST

Updated : Sep 26, 2019, 12:59 PM IST

ఉల్లి దుకాణాలపై విజిలెన్స్ దాడులు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉల్లిపాయల హోల్ సేల్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.పలు దుకాణాల్లో సరుకు నిల్వాల రికార్డులు నమోదు చేయటంలో అలసత్వం ప్రదర్శించటంతోపాటు,దుకాణ యాజమానులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.మార్కెట్ కమిటీకి సమర్పించాల్సిన అసెస్మెంట్లను సమర్పించలేదని అధికారులు తెలిపారు.తూకాలలో మోసాలకు పాల్పడుతుండటంతో కేసులు నమోదు చేశారు.మెుత్తం మూడు షాపుల్లో దాదాపు25లక్షల విలువైన ఉల్లిని అక్రమంగా నిల్వచేసినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Sep 26, 2019, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details