పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ ప్రాంగణంలో డిసెంబర్ 24న నిర్వహించనున్న తొలి స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ రానున్నట్లు నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వీఐపీలకు ఇబ్బంది లేకుండా నాలుగు హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారని.. వెల్లడించారు. 325 మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు పొందుతారని నిట్ డైరెక్టర్ వివరించారు.
తాడేపల్లిగూడెం నిట్ స్నాతకోత్సవానికి రానున్న ఉపరాష్ట్రపతి - తాడేపల్లి గూడెం నిట్ స్నాతకోత్సవం న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నట్లు నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు తెలిపారు. డిసెంబర్ 24వ తేదీన నిట్ ప్రాంగణంలో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

vice president of india will attend thadepalligudem nit convocation
తాడేపల్లిగూడెం నిట్ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి
ఇదీ చదవండి: