కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నాయకులు - lockdown problelms in west godavari dst
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో తెదేపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు.750 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5కేజీలు వచ్చేలా ప్యాక్ చేసి యువకుల సాయంతో అందించారు.

జిల్లాలో 750కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నాయకులు
దెందులూరు మండలం కొత్తగూడెం, సింగవరం గ్రామాల్లో 750 కుటుంబాలకు స్థానిక తేదేపా నాయకులు, కార్యకర్తలు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చిన కూరగాయలను ప్యాకింగ్ చేసి ఒక్కో కుటుంబానికి 5 కేజీలు వచ్చేలా ఉల్లిపాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటా, పచ్చిమిర్చి తదితర కూరగాయలను అందిచారు. స్థానిక యువకుల సాయంతో కూరగాయలతో పాటు ఒక్కో ఇంటికి ఐదు గుడ్లు చొప్పున 750 కుటుంబాలకు అందజేశారు.
ఇదీ చూడండిలిక్కర్ మాఫియాలో ఎవరున్నారో స్పీకరే చెప్పాలి: యరపతినేని