Vedic student died: గణపతి నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వేద విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అయిభీమవరంలో తితిదే నిర్వహిస్తున్న వేద పాఠశాల ప్రాంగణంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆకివీడు ఎస్సై కిరణ్‌కుమార్, ప్రిన్సిపల్ కేవీఎన్ కృష్ణప్రసాద్‌ల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ ప్రాంతానికి చెందిన సాలిపాక శశాంక్ (18) వేద పాఠశాలలో గత ఐదేళ్లుగా అభ్యసిస్తున్నారు. చవితి వేడుకల కోసం పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక మండపం ఏర్పాటుచేశారు. మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు మండపాన్ని అలంకరిస్తుండగా శశాంక్ వేదిక వద్ద తీగలను కలుపుతూ విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆకివీడులో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందారు. ఈ ఘటనపై మృతుడి బంధువు చింతలపాటి శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
Vedic student died: చవితి మండపం వద్ద వేద విద్యార్థి మృతి.. ఎక్కడంటే..? - వేద విద్యార్థి
Vedic student died: ఉల్లాసంగా వినాయకుడి పండుగ జరుపుకోవాలనుకున్నారు. నిత్యం వేదాలు వల్లించే ఆ విద్యార్థి... అందరితో కలిసి విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతలోనే అనుకోని ప్రమాదం అతడిని వెంటాడింది. పండుగ జరుపుకోకుండానే విద్యార్థి ప్రాణాలను గాల్లో కలిపేసింది. అసలేం జరిగిందంటే..?
వేద విద్యార్థి మృతి