ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VAYYERU KALUVA: వయ్యేరు కాలువకు పెరిగిన వరద.. నీటమునిగిన పలు కాలనీలు - floods in ap

పశ్చిమ గోదావరి జిల్లాలోని వయ్యేరు కాలువకు వరద ఉద్ధృతి పెరిగింది. దీని ఫలితంగా దువ్వ గ్రామంలోని పలు కాలనీలు నీట మునిగాయి. చాలా ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో.. గట్టుపైనే తాత్కాలికి నివాసం ఏర్పుచుకొని కాలం వెళ్లదీస్తున్నారు.

vayyeru-kaluva-flood-effect-on-duvva-village
వయ్యేరు కాలువకు పెరిగిన వరద.. నీటమునిగిన పలు కాలనీలు

By

Published : Sep 29, 2021, 10:43 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో వయ్యేరు కాలువకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఫలితంగా తణుకు మండలం దువ్వ గ్రామంలో గట్టు వద్దనున్న నివాస గృహాలు మునిగిపోతున్నాయి. అలాగే గట్టును ఆనుకొని ఉన్న వీధులన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరుచేరి ఇబ్బంది పడుతున్న బాధితులంతా గట్టు పైభాగంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకొని కాలం గడుపుతున్నారు. వయ్యేరు గట్టు బలహీనంగా ఉండటం వల్లే... వర్షాలు కురిసిన ప్రతీసారి ఇబ్బంది పడాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు.

దాదాపు 20 కుటుంబాలకు సంబంధించిన ఇళ్లు నీటిలో మునిగిపోయినట్లు చెబుతున్నారు. పాత పంచాయతీ కార్యాలయంలోనే దాదాపు 150 మంది గ్రామస్థులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తణుకు తహసీల్దార్ పీఎం​డీ ప్రసాద్ తెలిపారు.

ఇదీ చూడండి:RAINS: తగ్గని వరద ఉద్ధృతి..గులాబ్‌ ధాటికి అన్నదాతకు కష్టాలు

ABOUT THE AUTHOR

...view details