ఓటర్లను 'ఫిదా' చేసేందుకు 'మిస్టర్' వరుణ్ ప్రచారం
జనసేన ప్రచారం కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటోంది. ఓ వైపు పవన్ జోరుగా ప్రచారం చేస్తుంటే... ఆయనకు తోడుగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రంగంలోకి దిగాడు.
ప్రచారంలో అభిమానులకు కరచాలనం ఇస్తున్న వరుణ్
పశ్చిమగోదావరి జిల్లా తణుకు జనసేన పార్టీ అభ్యర్థి పసుపులేటి వెంకట రామారావు విజయాన్ని కాంక్షిస్తూ సినీ హీరో వరుణ్‌తేజ్ ప్రచారం నిర్వహించారు. అత్తిలి ప్రధాన రహదారి, రేలంగి, వేల్పూరు,తణుకులో రోడ్‌షో నిర్వహించారు. ప్రజలకు సేవ చేయటానికి తన బాబాయ్ పవన్ కల్యాణ్.. కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని వచ్చాడని ప్రజలందరూ మద్ధతివ్వాలని కోరారు. దారిపొడవునా జనసేన కార్యకర్తలు, అభిమానులు ప్రచార రథం వెంట పరుగులు తీశారు.