శ్రావణ శుక్రవారం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా దువ్వ గ్రామంలో ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో...స్థానిక మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే...తమ కుటుంబం సర్వ సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుందని భక్తుల విశ్వాసం. సుమారు 500మంది మహిళలు సాముహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ పండితులు సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రత పూజాను భక్తులతో చేయించారు.
శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని సర్వాలంకరణా భూషితురాలిగా తీర్చిదిద్దారు. పూజ అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని పంచిపెట్టారు.
ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం...
పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పండితులు సాంప్రదాయబద్దంగా వరలక్ష్మీ వ్రతాన్ని చేయించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకాలంకారంలో తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు.
ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
ఇదీ చూడండి:అందంగా ముస్తాబవుతోన్న ఇస్కాన్ మందిరాలు
Last Updated : Aug 23, 2019, 12:56 PM IST