పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో కొవిడ్ టీకా ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో భాగంగా సచివాలయాల్లో ఉదయం నుంచి వ్యాక్సిన్లు వేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి మొదటగా సరఫరా అయిన టీకా డోసులు మధ్యాహ్నం వరకు పంపిణీ పూర్తయ్యేవి. ఆ సమయానికి పట్టణానికి మరిన్ని వ్యాక్సిన్లు అందటంతో వ్యాక్సినేషన్ కొనసాగించారు.
Covid Vaccination: తణుకులో ఇంకా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఇంకా కొనసాగుతోంది. టీకా డోసులు అందుబాటులో ఉండటం, వ్యాక్సిన్ కోసం జనం బారులు తీరటంతో రాత్రి సమయం అయినప్పటికీ టీకా ఇస్తున్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ
రాత్రి సమయం అయినప్పటికీ పిల్లల తల్లులు, 45 సంవత్సరాలు నిండిన వారు తరలిరావడంతో టీకాలు వేస్తున్నారు. 17వ వార్డు సచివాలయంలో టీకాలు వేయించుకోవడానికి ఇప్పటికీ జనం బారులు తీరి ఉన్నారు. టీకా డోసులు పూర్తయ్యే వరకూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని ఇంఛార్జి దుర్గా మల్లేశ్వర రావు చెప్పారు.
ఇదీ చదవండి:Vaccination record: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సరికొత్త రికార్డు