వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద బారులు తీరిన జనం పశ్చిమ గోదావరిలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 32 వేల కొవాగ్జిన్, 17వేల కొవిషీల్డ్ టీకాలను అధికారులు అందుబాటులో ఉంచారు. మొదటి డోసు వేయించుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం రెండో డోసు ఇస్తున్నారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు తదితర ప్రాంతాల్లోని 110 కేంద్రాల్లో.. టీకా పంపిణీని వైద్య సిబ్బంది నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:మోదీకి కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ లేఖ
జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో 6 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల టీకా కోసం జనం కోసం బారులు తీరారు. వ్యాక్సిన్ అందుతుందో లేదో అని ఆతృతతో భౌతిక దూరం పాటించడం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరిస్తూ.. క్రమపద్ధతిలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:
తణుకులో బైక్‌పై ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన