వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పందన కార్యక్రమం ప్రారంభించింది. తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రజలు ప్రతి సోమవారం తమ సమస్యలను తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పిస్తే మీ సమస్యలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి వాటిని పరిష్కరిస్తారని తెలిపింది. ప్రజలు ఎంతో ఆశతో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్దకు వందల సంఖ్యలో వినతులు ఇవ్వడానికి వచ్చేవారు. ప్రజల తాకిడికి కార్యాలయాల్లో సిబ్బంది విధులు నిర్వహించుకోడానికి ఇబ్బందిపడేవారు. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే తుడా నిధులతో ప్రజలు వేచి ఉండడానికి వైఎస్సార్ రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
ఒక్కో కేంద్రానికి రూ.7 లక్షలు
ఒక్కో కేంద్రానికి తుడా నిధులు రూ.7 లక్షలు కేటాయించారు. ఇవి పూర్తయిన తర్వాత వీటిని ప్రజా అవసరాలకు ఉపయోగించకుండా, పస్తుతం వీటికి తాళాలు వేశారు. ఏడాది కావస్తున్నా వీటిని ఇంతవరకు ప్రజా అవసరాలకు వినియోగించకపోవడం గమనార్హం. పంచాయతీల్లో సచివాలయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు తమ సమస్యలను స్థానికంగా సచివాలయాల్లోనే ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. దీనికితోడు కరోనా రావడంతో ప్రజలు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు రావడం తగ్గించేశారు.
ఆధార్ కేంద్రాలకు వినియోగిస్తే: